VIDEO: సూర్యరథంపై దర్శనమిచ్చిన సీతారామచంద్రస్వామి
KNR: ఇల్లందకుంట శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయ ప్రాంగణం శ్రీరామ నామస్మరణతో మార్మోగింది. సీతా లక్ష్మణ సమేతంగా స్వామివారు సూర్యరథంపై భక్తులకు దర్శనమిచ్చారు. గురువారం అర్ధరాత్రి తర్వాత మాడవీధుల్లో వైభవోపేతంగా సూర్య రథోత్సవ ఊరేగింపు నిర్వహించారు. భక్తులు, యువకులు “జై శ్రీరామ్" నినాదాలతో ఉత్సాహంగా రథాన్ని లాగారు.