275 కిలోల గంజాయి పట్టివేత

275 కిలోల గంజాయి పట్టివేత

మేడ్చల్: గంజాయి తరలిస్తున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు జిల్లాలోని శామీర్‌పేట్ ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలో ఆదివారం సైబరాబాద్ ఎస్వోటీ పోలీసులు తనిఖీ చేపట్టారు. ఒడిశా నుంచి హైదారాబాద్‌కు వస్తున్న ఓ బొలేరో వాహనాన్ని తనిఖీ చేయగా.. అందులో దాదాపు 275 కిలోల గంజాయి లభ్యమైంది.