VIDEO: ర్యాలీలో పాల్గొన్న జిల్లా కలెక్టర్
CTR: భారత మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ జయంతి ఉత్సవాలు ఆదివారం చిత్తూరు జిల్లాలో ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా నగరంలో చేపట్టిన ర్యాలీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ భవనం వరకు కొనసాగింది. సమాజంలో అణగారిన వర్గాల సంక్షేమం కోసం అలుపెరుగని కృషి చేసిన సంఘ సంస్కర్త, స్వాతంత్య్ర సమరయోధులు బాబు జగ్జీవన్ రామ్ అని కొనియాడారు.