ఛాంపియన్షిప్ ట్రోఫీ విజేతను అభినందించిన కలెక్టర్

MDK: ఆర్ఎస్ఎస్ కాయ్ జాతీయస్థాయి కరాటే పోటీలలో సీనియర్ బ్లాక్ బెల్ట్, గర్ల్స్ విభాగంలో కట, వెపన్స్‌లో మెదక్‌కు చెందిన నితన్యసిరి గోల్డ్ మెడల్ సాధించి గ్రాండ్ ఛాంపియన్షిప్ ట్రోఫీ కైవసం చేసుకుంది. దీంతో పాటు ఉత్తమ రెఫరీగా కూడా నిర్వహించడం అభినందనీయమని కలెక్టర్ అన్నారు. జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తన ఛాంబర్లో నితన్యసిరిని అభినందించి మరిన్ని పతకాలు సాధించాలన్నారు.