రేగోడు మండల కేంద్రాన్ని సందర్శించిన మంత్రి

MDK: రేగోడు మండల కేంద్రాన్ని మంత్రి దామోదర శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి తన తమ్ముడి కుమార్తె వివాహానికి కాంగ్రెస్ పార్టీ నాయకులను ఆహ్వానించారు. మండల సోదరీమణులు మంత్రికి స్నేహబంధానికి ప్రతీకగా రాఖీ కట్టి, ఆయన ఆశీర్వాదం పొందారు. ఒక లబ్ధిదారుడి ఇందిరమ్మ ఇళ్లు నిర్మాణానికి భూమిపూజ చేశారు. అనంతరం స్థానిక ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.