జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్‌ను కలిసిన కార్యనిర్వాహక అధికారిణి
కృష్ణా: మచిలీపట్నంలో జిల్లా పరిషత్ ఛైర్‌పర్సన్ ఉప్పాల హారికను, పదోన్నతిపై జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారిణిగా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన అరుణ బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా శ్రీమతి అరుణ మాట్లాడుతూ.. తనకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ, జిల్లా పరిషత్ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు.