VIRAL: మ్యూజిక్ షోలో కుప్పకూలిన పాప్ స్టార్
దక్షిణ కొరియా పాప్ స్టార్, కే పాప్ సెన్సేషన్ హ్యూనా ఇటీవల తన మ్యూజిక్ కన్సర్ట్‌లో వేదికపై ప్రదర్శన ఇస్తుండగా అకస్మాత్తుగా కుప్పకూలింది. తన మ్యూజిక్ ఫెస్టివల్ ప్రదర్శనలో పాట పాడుతుండగా ఈ ఘటన జరిగింది. నిర్వాహకులు వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించిన వీడియో SMలో వైరల్ అవుతోంది.