VIDEO: గోతులమయంగా భీమవరం-ముగడ రహదారి

VIDEO: గోతులమయంగా భీమవరం-ముగడ రహదారి

VZM: బాడంగి మండలం భీమవరం-ముగడ రోడ్డు గోతులమయంగా మారింది. రోడ్డుపై పెద్దపెద్ద గోతులు ఏర్పడడంతో రాకపోకలకు ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బాడంగి నుంచి బొబ్బిలి రావాలంటే ఇదే మార్గంలో రావాలి. రోడ్డుపై గోతులు ఉండడంతో వర్షాలు కురుసే సమయంలో వరదనీరు చేరడం వలన వాహనదారులు అవస్థలు పడుతున్నారు. రోడ్డు బాగు చేయాలని ప్రజలు, వాహనదారులు కోరుతున్నారు.