మామిడి తోటలో ఉరివేసుకొని వ్యక్తి ఆత్మహత్య
JGL: మల్లాపూర్ మండలం వెంకట్రావుపేటలో పెద్దమ్మ తండాకు చెందిన జరుపుల రమేశ్ శనివారం గ్రామ శివారులోని మామిడి తోటలో ఉరివేసుకొని మృతి చెందాడు. కుటుంబ కలహాలు, ఆర్థిక సమస్యలే కారణమని స్థానికులు భావిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.