HYD మురికివాడల్లో ఇందిరమ్మ ఇళ్ల పై కసరత్తు..!
HYD: నగర పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. మురికివాడలో బహుళ అంతస్తుల్లో వీటిని నిర్మించి అందించాలని సూత్రప్రాయంగా నిర్ణయించిన ప్రభుత్వం, ప్రణాళిక రచిస్తున్నట్లు రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. మధ్యతరగతి వారికి ఇళ్లు అందించేలా రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ కింద ఇప్పటికే CBRI సంస్థను ఎంపిక చేసింది.