VIDEO: ప్రధాన రహదారిపై వీధి దీపాల ఇక్కట్లు
ASF: ఆసిఫాబాద్ పట్టణంలోని ప్రధాన రహదారిపై డివైడర్ మధ్యలో వీధి దీపాలు గత కొన్ని నెలలుగా పనిచేయడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాత్రి వేళల్లో వాహనదారులు, పాదచారులు చీకటి ఉండడంతో సురక్షితంగా ప్రయాణించలేక పోతున్నారని పేర్కొన్నారు. ఈ మేరకు అధికారులు తక్షణమే స్పందించి సమస్యను పరిష్కరించాలని వారు కోరుతున్నారు.