పెట్లూరివారిపాలెంలో కారు, బస్సు ఢీ

పెట్లూరివారిపాలెంలో కారు, బస్సు ఢీ

పల్నాడు: నరసరావుపేట మండలం పెట్లురివారిపాలెం సమీపంలో గుంటూరు-కర్నూలు హైవేపై గురువారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల మేరకు.. విరాట గ్రామానికి చెందిన గోపి నడుపుతున్న కారు నియంత్రణ అదుపు తప్పడంతో ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును ఢీకొన్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గాయాలపై వివరాలు తెలియాల్సి ఉంది.