శతాబ్దం తర్వాత గంగమ్మ గావు జాతర
PPM: మక్కువ మండల కేంద్రంలోని స్థానిక యాదవ వీధిలో కొల్లి వారి కుల దైవం, యాదవుల ఇలవేల్పు గంగమ్మ తల్లి గావు పండుగ మంగళవారం అత్యంత వైభవంగా జరిగింది. మహిళలు పందిరిరాట అరటి గెలలు, చీరలు వేలాడదీసి, మొక్కులు చెల్లించుకున్నారు. దాదాపు వంద సంవత్సరాల తర్వాత ఈ సంప్రదాయ వేడుకను మళ్లీ నిర్వహించడంతో పెద్ద ఎత్తున గ్రామ ప్రజలు పాల్గొన్నారు.