ఎమ్మెల్యే కొలికపూడి అధ్యక్షతన అభివృద్ధి పనులపై సమీక్ష

ఎమ్మెల్యే కొలికపూడి అధ్యక్షతన అభివృద్ధి పనులపై సమీక్ష

కృష్ణా: ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు అధ్యక్షతన మంగళవారం అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తిరువూరు నియోజకవర్గంలోని నాలుగు మండలాల ఎంపీడీవోలు, ఏపీవోలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాబోయే వేసవిని దృష్టిలో ఉంచుకుని మంచినీటి సరఫరా, డ్రైనేజీల పూడిక తీత, ఉపాధి హామీ పనుల పురోగతిపై ఎంపీడీవోలు, ఏపీవోలు తదితరులతో ఆయన చర్చించారు.