కాంగ్రెస్‌కు ప్రతిపక్ష హోదా కూడా రాదు: హరీష్ రావు

కాంగ్రెస్‌కు ప్రతిపక్ష హోదా కూడా రాదు: హరీష్ రావు

TG: మళ్లీ గెలుస్తామని సీఎం రేవంత్ రెడ్డి కలలు కంటున్నారని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా కాంగ్రెస్‌కు వచ్చేది సింగిల్ డిజిట్ మాత్రమేనని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి పాలనలో ప్రజాస్వామ్యం ఖూనీ అయిందని ఆక్షేపించారు. ప్రతిపక్షాలు కనీసం ప్రశ్నించవద్దంటున్నారని ధ్వజమెత్తారు. తమను అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు.