వరద ముప్పుపై ఎంపీ ఆరా..!

ELR: ఎగువనుంచి వస్తున్న వరద, భారీ వర్షాల ప్రభావంతో కొల్లేరు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ఈ పరిస్థితిపై ఏలూరు ఎంపీ పుట్టా మహేష్, కైకలూరు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్, అధికారులతో మాట్లాడి వాస్తవ పరిస్థితిని ఆరా తీశారు. రోడ్లు తెగిపోవడం, లంక గ్రామాల రాకపోకలకు ఇబ్బందులు, వంతెనల వద్ద తూడు పేరుకుపోవడంపై ఆందోళన వ్యక్తం చేసి తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు.