ఎమ్మెల్యే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరికలు
MBNR: జిల్లా వ్యాప్తంగా అధిక సంఖ్యలో కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని ఎమ్మెల్యే జీ.మధుసూధన్ రెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ విధానాలు, ప్రజా సంక్షేమ కార్యక్రమాలపై విశ్వాసం పెరిగి పార్టీలో చేరుతున్నారని ఆయన తెలిపారు. ఇవాళ దేవరకద్ర మున్సిపాలిటీ పరిధిలోని వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.