ఏపీ హైకోర్టులో కేతిరెడ్డి పెద్దారెడ్డికి షాక్

ఏపీ హైకోర్టులో కేతిరెడ్డి పెద్దారెడ్డికి షాక్

AP: వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి హైకోర్టులో చుక్కెదురైంది. తాడిపత్రికి వెళ్లేందుకు భద్రత కల్పించాలన్న సింగిల్ బెంచ్ ఆదేశాలను.. డివిజన్ బెంచ్ కొట్టివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అదేవిధంగా కేతిరెడ్డి పెద్దారెడ్డికి నోటీసులు ఇవ్వాలని ఆదేశాల్లో పేర్కొంది. తదుపరి విచారణ మూడు వారాలకు వాయిదా వేసింది.