రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
NGKL: నాగర్ కర్నూల్ మండలం పెద్దాపూర్‌కు చెందిన చేట్టమొని కృష్ణయ్య (42) రోడ్డు ప్రమాదంలో మృతిచెందారని స్థానికులు తెలిపారు. ఇవాళ బస్సులో రావాల్సిన తన కూతురుని.. బస్సుల బంద్ కారణంగా తానే తీసుకొద్దామని బైక్‌పై NGKL నుంచి HYDకు బయలుదేరగా.. వెల్దండ సమీపంలో గుర్తుతెలియని వాహనం ఢీకొట్టిందని చెప్పారు. ఈ ప్రమాదంలో కృష్ణయ్య అక్కడికక్కడే మరణించారన్నారు.