భారీ వర్షానికి కూలిన ఇల్లు

భారీ వర్షానికి కూలిన ఇల్లు

అల్లూరి: ఏకధాటిగా కురుస్తున్న భారీ వర్షానికి హుకుంపేట మండలంలోని గవ్వలమామిడి గ్రామానికి చెందిన బద్నాయిని చిన్నాలమ్మ అనే మహిళకు చెందిన ఇల్లు కూలిపోయింది. ఇల్లు కూలుతున్న సమయంలో ఇంట్లోని వారు బయటకు పరుగులు తీయడంతో పెద్ద ప్రమాదం తప్పిందని గ్రామస్తులు తెలిపారు. ఇల్లు కూలిపోయి తీవ్రంగా నష్టపోయిన చిన్నాలమ్మకు రూ.2లక్షల పరిహారం, నూతన ఇల్లు మంజూరు చేయాలని కోరారు.