మదన్ లాల్ మృతికి మంత్రి పొంగులేటి సంతాపం

KMM: వైరా మాజీ ఎమ్మెల్యే బాణోత్ మదన్ లాల్ మృతి పట్ల తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. ఈ మేరకు మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా గతంలో వైసీపీ, BRSలో ఉన్నపుడు ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. మదన్ లాల్ మృతి వారి కుటుంబానికి తీరని లోటని పేర్కొన్నారు.