గన్నవరంలో విద్యార్థులకు అవగాహన కార్యక్రమం

కృష్ణా: గన్నవరంలోని ఓ పాఠశాలలో సీఐ బీ.వీ. శివ ప్రసాద్ ఆధ్వర్యంలో విద్యార్థులకు అవగాహన కార్యక్రమం శుక్రవారం జరిగింది. ఈ సందర్భంగా ఆయన పోక్స్ చట్టం గురించి వివరిస్తూ బాలలపై లైంగిక దాడులు, వేధింపులపై కఠిన శిక్షలు ఉంటాయని తెలిపారు. డ్రగ్స్ వినియోగం ఆరోగ్యానికి ప్రమాదమని హెచ్చరించి, సైబర్ నేరాల నుంచి జాగ్రత్తలు పాటించాలని సూచించారు.