వేసవిలో తాగునీటి ఇబ్బందులు లేకుండా చూడాలి: కలెక్టర్

వేసవిలో తాగునీటి ఇబ్బందులు లేకుండా చూడాలి: కలెక్టర్

ప్రకాశం: వేసవిని దృష్టిలో ఉంచుకొని జిల్లాలో తాగునీటి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లో జరిగిన సమావేశంలో సమస్యలు వచ్చే ప్రాంతాలను ముందుగానే గుర్తించి పరిష్కార చర్యలు చేపట్టాలని సూచించారు. సాగర్ నీటి సమీప గ్రామాలకు నీటి సరఫరా పెంచాలని అన్నారు.