రేపు ఆదిలాబాద్ జిల్లాకు రేవంత్
TG: CM రేవంత్ రేపు ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. 'పీపుల్స్ మార్చ్'కు మూడేళ్లు పూర్తైన సందర్భంగా బజార్ హత్నూర్ మండలం పిప్పిరిలో జరిగే బహిరంగ సభకు హాజరుకానున్నారు. సభ నేపథ్యంలో జిల్లాలో అధికారులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. కాగా 2023 మార్చి 16న ఇదే గ్రామం నుంచి భట్టి విక్రమార్క పిపుల్స్ మార్చ్ పాదయాత్ర చేపట్టి కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్ నింపారు.