దుద్దుకూరులో ప్రారంభమైన పెన్షన్ పంపిణీ
E.G: దేవరపల్లి మండలం దుద్దుకూరు గ్రామంలో శనివారం ఉదయం "ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్" పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది. గ్రామ సెక్రటరీ రామచంద్రరావు అధికారులతో కలిసి పెన్షన్‌లు పంపిణీ చేస్తున్నారు. అర్హులైన వృద్ధులకు, వితంతువులకు, వికలాంగులకు తెల్లవారుజామునంచే పెన్షన్ పంపిణి చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఆయన వెంట ఇంజనీర్ అసిస్టెంట్ ఆంజనేయులు ఉన్నారు.