నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

AKP: కే కోటపాడు సబ్ స్టేషన్ పరిధిలో సోమవారం విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని ఏఈ చంద్రశేఖర్ తెలిపారు. సబ్ స్టేషన్‌లో మరమ్మతు పనులు చేపడుతున్న కారణంగా మధ్యాహ్నం 12:30 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు కే కోటపాడు, కే సంతపాలెం, జోగన్నపాలెం, ఆర్లి, ఏ. భీమవరం, మేడిచర్ల, చంద్రయ్యపేట, దాలివలస, తదితర గ్రామాలకు విద్యుత్ సరఫరాను నిలిపివేస్తున్నట్లు తెలిపారు.