యుద్ధం ఆపేందుకు వెళ్తుంటే అడ్డుకున్నారు: KA పాల్

యుద్ధం ఆపేందుకు వెళ్తుంటే అడ్డుకున్నారు: KA పాల్

భారత్-పాక్ మధ్య యుద్ధాన్ని ఆపేందుకు టర్కీ వెళ్తుండగా తనను విమానాశ్రయంలో అడ్డుకుంటున్నారని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు KA పాల్ ఆరోపించారు. అన్ని సరైన పత్రాలు ఉన్నప్పటికీ తనను ఎందుకు అనుమతించడం లేదని ఆయన ఎయిర్‌పోర్ట్ అధికారులను ప్రశ్నించారు. ఈ ఘటనతో ఎయిర్ పోర్టులో కొంత గందరగోళం నెలకొంది. అయితే, అధికారులు పాల్‌ను ఎందుకు అడ్డుకుంటున్నారనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు.