అల్లూరి బస్సు దుర్ఘటనపై ఎంపీ నాగరాజు విచారం

అల్లూరి బస్సు దుర్ఘటనపై ఎంపీ నాగరాజు విచారం

KRNL: అల్లూరి సీతారామరాజు జిల్లాలో జరిగిన బస్సు దుర్ఘటనపై కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. పార్లమెంట్ సమావేశల మధ్య విడుదల చేసిన ప్రకటనలో చిత్తూరు భక్తులు అన్నవరంకు వెళ్తుండగా మారేడుమిల్లి ఘాట్‌లో బస్సు లోయలో పడటం వల్ల 9 మంది మృతి చెందడం బాధాకరమన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేసి, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలన్నారు.