చేప పిల్లల విడుదలకు ఏర్పాట్లు పూర్తి

చేప పిల్లల విడుదలకు ఏర్పాట్లు పూర్తి

MNCL: జిల్లాలో నేటి నుంచి చేప పిల్లల విడుదలకు అన్ని ఏర్పాట్లు చేశారు. జిల్లా వ్యాప్తంగా 380 చెరువులు, కుంటలు, రిజర్వాయర్లలో 2.23 కోట్ల చేప పిల్లలు విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందులో 35 నుంచి 40 మిల్లీమీటర్ల పరిమాణం గల 115.65 లక్షలు, 80 నుంచి 100 మిల్లీమీటర్ల పరిమాణం గల 108.28 లక్షల చేప పిల్లలు విడుదల చేయనున్నారు.