నేటి నుంచి హెచ్‌పీవీ టీకా స్పెషల్ డ్రైవ్

నేటి నుంచి హెచ్‌పీవీ టీకా స్పెషల్ డ్రైవ్

MULG: జిల్లాలో బుధవారం నుంచి హెచ్‌పీవీ టీకా స్పెషల్ డ్రైవ్ నిర్వహించనున్నట్లు జిల్లా వైద్యాధికారి గోపాలరావు తెలిపారు. వైద్య సిబ్బందితో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. 14ఏళ్లు నిండిన ప్రతి బాలికకు టీకా వేయించి గర్భాశయ క్యాన్సర్ నుంచి రక్షించాలని సూచించారు. గ్రామాల్లో టీబీ నిర్ధారణ పరీక్షలు కూడా నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.