ఓటు వేయడానికి వెళ్తుండుగా దంపతులకు ప్రమాదం.. గాయాలు

కరీంనగర్: జమ్మికుంట మండలం తనుగుల గ్రామంలోని మూల మలుపు వద్ద చెట్టును కారు ఢీ కొట్టిన ఘటనలో భార్యభర్తలకు తీవ్ర గాయాలయ్యాయి. వరంగల్ నుండి కాల్వశ్రీరాంపూర్ మండలం బేగంపేట గ్రామానికి ఓటు వేయడానికి వెళుతున్న శ్రీనివాస్-రమ దంపతుల కారు తనుగుల గ్రామంలోని మూలమలుపు వద్ద చెట్టుని ఢీకొట్టింది. కారులో ప్రయాణిస్తున్న భార్యభర్తలతో పాటు చిన్న పాపకి గాయాలయ్యాయి.