కోళ్ల ఫారం తొలగించాలని గ్రామస్తుల డిమాండ్

VZM: గజపతినగరం మండలం పాత బగ్గాం గ్రామ సమీపంలో ఉన్న కోళ్ల ఫారం తొలగించాలని శనివారం స్థానిక గ్రామాల ప్రజలు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... కోళ్ల ఫారం సమీప గ్రామాలైన భూదేవి పేట, బంగారమ్మ పేట, పాత బగ్గాo గ్రామాల ప్రజలు కోళ్ల ఫారం నుంచి వచ్చే దుర్వాసనతో ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈగలు, దోమలు స్వైరవిహారంతో అనారోగ్యల బారిన పడుతున్నామని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.