పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య
MDK: పాపన్నపేట మండలంలో విషాద ఘటన జరిగింది. కొత్తపల్లి గ్రామానికి చెందిన బైకనీ శ్రీనివాస్ (38) ప్రైవేటు డ్రైవర్‌గా పనిచేసేవాడు. కొన్ని నెలల క్రితం ప్రమాదంలో కాలు విరగడంతో ఇంటివద్దే ఉంటున్నాడు. దీంతో జీవితంపై విరక్తి చెంది బుధవారం పొలానికి వెళ్లి పురుగుల మందు తాగాడు. ఈ క్రమంలో స్థానికులు ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ రాత్రి మృతి చెందాడు.