ఉరి వేసుకుని వ్యక్తి ఆత్మహత్య

SRCL: చెట్టుకు ఉరివేసుకుని వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కోనరావుపేట మండలంలో చోటుచేసుకుంది. నిమ్మపల్లి గ్రామానికి చెందిన బోయిని మల్లేశం(55) అనేవ్యక్తి అనారోగ్యంతో జీవితంపై విరక్తిచెంది శుక్రవారం ఆత్మహత్య చేసకున్నట్లు స్థానికులు తెలిపారు. గ్రామశివారులోని విద్యుత్ సబ్‌స్టేషన్ దగ్గరలో ఉన్న ఓ చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు గ్రామస్థులు పేర్కొన్నారు.