వీరయ్య చౌదరి హత్య కేసులో కీలక నిందితుడు అరెస్ట్

వీరయ్య చౌదరి హత్య కేసులో కీలక నిందితుడు అరెస్ట్

ప్రకాశం: నాగులుప్పలపాడు మాజీ ఎంపీపీ, టీడీపీ నేత ముప్పవరపు వీరయ్య చౌదరి హత్య కేసులో కీలక నిందితుడు ముప్పా సురేష్‌ను సోమవారం పోలీసులు అరెస్ట్ చేశారు. ఏప్రిల్ 22న ఒంగోలు సాంబశివనగర్‌లో వీరయ్య చౌదరి దారుణంగా హత్యకు గురయ్యారు. రాజకీయ విభేదాలే హత్యకు కారణమని పోలీసులు భావిస్తున్నారు. కాగా, ఇప్పటికే ఈ కేసులో కిరాయి హంతకులతో సహా 9 మందిని అదుపులోకి తీసుకున్నారు.