భార్య సర్పంచ్.. భర్త వార్డ్ మెంబర్
SDPT: దుబ్బాక మండలం శిలాజి నగర్ గ్రామ సర్పంచ్‌గా బానోత్ సునీత ఆదివారం జరిగిన ఎన్నికల ఫలితాల్లో భారీ మెజార్టీతో గెలుపొందారు. అదేవిధంగా ఆమె భర్త బానోత్ సంతోష్ కుమార్ గ్రామంలోని ఐదో వార్డు సభ్యుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. భార్య సర్పంచిగా, భర్త వార్డు సభ్యుడిగా ఒకే గ్రామంలో ప్రజాప్రతినిధులుగా కొనసాగడం స్థానికంగా ప్రాధాన్యం సంతరించుకుంది.