ఆరోగ్యంపై అవగాహన కలిగి ఉండాలి: ఎమ్మెల్యే

ఆరోగ్యంపై అవగాహన కలిగి ఉండాలి: ఎమ్మెల్యే

NLR: ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా వింజమూరులో మంగళవారం జరిగిన కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే కాకర్ల సురేశ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రతి ఒక్కరు ఆరోగ్యంపై అవగాహన కలిగి ఉండాలన్నారు. రోజురోజుకి మనిషిలో వస్తున్న మార్పులు గమనించి ఆరోగ్యంగా ఉండేలా జాగ్రత్తలు పాటించాలన్నారు. మనిషి జీవితంలో ఆరోగ్యం అత్యంత విలువైన సంపద అని స్పష్టం చేశారు.