కొండమల్లేపల్లిలో చోరీ.. ఇద్దరు మహిళల అరెస్ట్

కొండమల్లేపల్లిలో చోరీ.. ఇద్దరు మహిళల అరెస్ట్

NLG: వినాయక బైక్ షాపులో అల్యూమినియం వస్తువులు దొంగిలించిన ఇద్దరు మహిళలను అరెస్ట్ చేసినట్లు సీఐ నవీన్ కుమార్ తెలిపారు. బుధవారం ఎస్సై అజ్మీరా రమేష్ సిబ్బందితో కలిసి వాహనాల తనిఖీలు నిర్వహిస్తుండగా చోరీ సొత్తును అమ్మేందుకు వెళ్తున్న పర్వతం కోటమ్మ, దుద్దుర్ వీరమ్మ పట్టుబడ్డారు. నిందితులు నేరాన్ని అంగీకరించడంతో వారిని రిమాండ్‌కు తరలించినట్లు సీఐ పేర్కొన్నారు.