ఇంట్లో గ్యాస్ పైప్ లీక్.. తప్పిన ప్రమాదం

ఇంట్లో గ్యాస్ పైప్ లీక్.. తప్పిన ప్రమాదం

SRD: ఝరాసంగం పట్టణంలోని బుడగ జంగాల కాలనీలోని మల్లమ్మ అనే మహిళ ఇంట్లో వంట గ్యాస్ పైప్ లీక్ అయ్యింది. దీంతో ఇంట్లో మంటలు చెలరేగి వంట సామాగ్రి, నిత్యావసర సరుకులు దగ్ధమయ్యాయి. అయితే, అదృష్టవశాత్తు ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. విషయం తెలుసుకున్న స్థానికులు వెంటనే గ్యాస్ సిలిండర్‌ను బయటకు తీసేయడంతో ప్రమాదం తప్పింది. దీంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.