రాష్ట్ర విపత్తు నిర్వహణ కార్యదర్శికి స్వాగతం పలికిన కలెక్టర్

HNK: రాష్ట్ర విపత్తు నిర్వహణ ప్రత్యేక కార్యదర్శి, సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్‌ను వరంగల్ NIT వద్ద జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ సోమవారం మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్ర విపత్తు నిర్వహణ ప్రత్యేక కార్యదర్శి అరవింద్ కుమార్‌కు కలెక్టర్ మొక్కను అందజేసి స్వాగతం పలికారు.