VIDEO: నూజివీడు ప్రజలారా తస్మాత్ జాగ్రత్త

ELR: నూజివీడు పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయ సమీపంలోని ఐసీడీఎస్ సీడీపీఓ కార్యాలయం పక్క సందులో విద్యుత్తు తీగలపై తాటి చెట్టు పడింది. మైలవరం రోడ్డు నుండి ఐసీడీఎస్ సీడీపీఓ కార్యాలయానికి వచ్చే రహదారిలో తాటి చెట్టు ఒరిగి విద్యుత్తు తీగలపై పడింది. అటుగా వెళ్లేందుకు నిత్యం ప్రజలు భయభ్రాంతులవుతున్నారు. అధికారులు స్పందించి తాటి చెట్టును తొలగించాలని స్థానికులు కోరారు.