VIDEO: హాజరు పడక ఉపాధి కూలీల అవస్థలు
PPM: కురుపాం మండలం తోలుంగూడ, కోసంగూడ గ్రామాలకు చెందిన ఉపాధి హామీ కూలీలు పేస్ అటెండెన్స్ నమోదు కాక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉపాధి పనుల కోసం ఉదయం నుంచే పనిస్థలికి చేరుకున్న కూలీలు, హాజరు నమోదు కాకపోవడంతో గంటల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. పేస్ అటెండెన్స్ వ్యవస్థ సక్రమంగా పనిచేసేలా చూడాలని అధికారులను కోరుతున్నారు.