VIDEO: ఉయ్యూరులో భారీ అన్నదానం
కృష్ణా: ఉయ్యూరులో వీరమ్మ తల్లి తిరుణాల సందర్భంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం భారీ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సుమారు పదివేల మంది భక్తులకు అన్నప్రసాదం వడ్డించారు. ఉయ్యూరు సీఐ రామారావు ముఖ్య అతిథిగా హాజరై అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. తిరుణాలకు పరిసర గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.