మే 9న లోక్ అదాలత్

మే 9న లోక్ అదాలత్

BPT: జాతీయ లోక్ అదాలత్ ద్వారా కక్షిదారులకు సత్వర న్యాయం లభిస్తుందని నాలుగో అదనపు జిల్లా జడ్జి ఆర్. శరత్ బాబు అన్నారు. జిల్లా న్యాయసేవాధికార సంస్థ గుంటూరు ఆధ్వర్యంలో బాపట్ల కోర్టుల సముదాయంలో మండల న్యాయ సేవా కమిటీ ద్వారా మే9న జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రాజీ పడదగిన కేసులను రాజీ చేసుకుని లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.