భర్త మందలించడంతో భార్య ఆత్మహత్య

CTR: భర్త మందలించాడని భార్య పురుగు మందు తాగి మృతి చెందిన ఘటన పుంగనూరు మండలంలో జరిగింది. వివరాల్లోకెళ్తే వనమలదిన్నె గ్రామానికి చెందిన భాస్కర్ భార్య దుర్గా(34) పిల్లలను మందలిస్తుండగా ఆమె భర్త మండిపడ్డాడు. దీంతో ఇంట్లోనే ఆమె పురుగు మందు తాగి అస్వస్థతకు గురైంది. కాగా, కుటుంబ సభ్యులు పుంగనూరు ప్రభుత్వాస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు.