VIDEO: 'ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి'
VKB: విద్యార్థులకు అర్ధమయ్యే విధంగా బోధన పద్ధతులను పాటించాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతిక్ జైన్ అన్నారు. ధరూర్ మండలం లోని జిల్లా పరిషత్ పాఠశాలలో ఇవాళ నిర్వహించిన స్కూల్ కాంప్లెక్స్ సమావేశానికి కలెక్టర్ హాజరయ్యారు. విద్యార్థులు ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాల్ని సద్వినియోగం చేసుకోవాలని మంచిగా చదువుకొని ఉన్నత స్థాయికి చేరుకోవాలని తెలిపారు.