నగరంలో బార్ పెట్టాలనుకునే వారికి అవకాశం

నగరంలో బార్ పెట్టాలనుకునే వారికి అవకాశం

HYD: ఎక్సైజ్ శాఖ 28 (2B) బార్లకు దరఖాస్తులను స్వీకరిస్తోంది. ఇందులో GHMC పరిధిలోనే 24 ఉన్నాయి. మహబూబ్‌నగర్, బోధన్, నిజామాబాద్, జల్పల్లి మునిసిపాలిటీల్లో ఒక్కొక్క బార్ పెట్టేందుకు అవకాశం ఉందని నోటిఫికేషన్ వచ్చింది. గతంలో లైసెన్స్ పొంది, ఫీజులు చెల్లించనందున 28 బార్లు రద్దు కాగా, పునరుద్ధరణ చర్యలు చేపట్టారు. దరఖాస్తు కోసం రూ. 1 లక్ష చెల్లించాలి.