రేపు మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశం

VZM: బొబ్బిలి మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశం బుధవారం కౌన్సిల్ హాల్లో జరగనుంది. మున్సిపల్ ఛైర్మన్ శరత్ బాబు అధ్యక్షతన ఈ సమావేశాం నిర్వహిస్తున్నట్లు మంగళవారం కమిషనర్ రామలక్ష్మి ప్రకటనలో తెలిపారు. అభివృద్ధి పనులకు సంబంధించి పలు అంశాలను అజెండాలో చేర్చినట్లు ఆమె తెలిపారు. ఈ సమావేశనికి కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు అధికారులు హాజరు అవ్వాలని కోరారు.