విద్యుత్ సంస్థలపై 31 ఫిర్యాదులు

విద్యుత్ సంస్థలపై 31 ఫిర్యాదులు

AKP: కోటవురట్ల మండలం కైలాసపట్నం విద్యుత్ కార్యాలయం వద్ద గురువారం నిర్వహించిన గ్రీవెన్స్‌లో సమస్యలపై ప్రజలు 31 ఫిర్యాదులను అందజేశారు. ఏఈ పరమేశ్వరరావు విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు పలువురు ఫిర్యాదు చేశారు. తరచు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందన్నారు. లోఓల్టేజ్ సమస్యను పరిష్కరించాలన్నారు. సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.