డీఎస్సీలో ఉద్యోగం సాధించిన వీఆర్ఏ

కృష్ణా: మోపిదేవి తహసీల్దార్ కార్యాలయంలో వీఆర్ఏగా విధులు నిర్వహిస్తున్న పోలిమెట్ల స్వయంప్రభ ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా ఉద్యోగం సాధించారు. స్వయంప్రభ ఎస్ఏ - సోషల్‌లో 76.94 మార్కులతో జిల్లా ఇరవైవ ర్యాంకు సాధించి బీసీ-ఏ కోటాలో ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా ఉద్యోగం సాధించారు. ప్రభుత్వ టీచర్ పోస్ట్ సాధించాలనే ఆకాంక్ష కూటమి ప్రభుత్వంలో నెరవేరటం తనకెంతో సంతోషంగా ఉందన్నారు.